శేఖర్ కమ్ముల-నాగ చైతన్య …ఇది అసలు టాక్స్ లో కాదు కదా కనీసం కన్సిడరేషన్ లో కూడా లేని కాంబినేషన్.కానీ ఈ కాంబో ఉండబోతుంది అనే రూమర్స్ కంటే ముందు వాళ్ళ కాంబినేషన్ లో సినిమా ఫైనల్ అయ్యింది.సింగిల్ సిట్టింగ్ లో తన కథతో చైతూ ని ఒప్పించాడు శేఖర్.సాయి పల్లవి లైవ్ విని ఓకే చెప్పేసింది.ఏషియన్ సునీల్ ప్రొడ్యూసర్.
[INSERT_ELEMENTOR id=”3574″]
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి స్టార్ట్ కావడం.శేఖర్,చైతూ సినిమా కథ వెనుక మరో కథ కూడా ఉంది అని టాక్.అదేంటంటే ఏషియన్ సునీల్ ప్రొడ్యూసర్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కొత్త నటీనటులతో ఒక సినిమా స్టార్ట్ అయ్యింది.ఆ సినిమా 50% చిత్రీకరణ కూడా పూర్తయింది.ఎప్పట్లానే శేఖర్ కమ్ముల సైలెంట్ గా టీజర్ వదులుతాడు అని అనుకున్నారు అంతా.ఈ లోగా చైతూ సినిమా అనౌన్స్ చేసాడు.అయితే శేఖర్ కొత్తవాళ్లతో తీస్తున్న ఆ సినిమాలో డాన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది,అందుకే మూడు నెలలు వాళ్ళని ఆ ట్రైనింగ్ కి పంపించారు అని అన్నారు.
[INSERT_ELEMENTOR id=”3574″]
కానీ కట్ చేస్తే శేఖర్ కమ్ముల తీసిన ఆ సినిమా అవుట్ ఫుట్ అతనికే నచ్చలేదట.అందుకే సినిమా పూర్తిగా క్యాన్సిల్ చేశారు.అవుట్ ఫుట్ ఏ మాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో రీ షూట్ ప్రపోజల్ కూడా కన్సిడర్ చేయలేదట.హ్యాపీ డేస్,ఆనంద్ లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న శేఖర్ కమ్ముల కి ఈ సిట్యుయేషన్ రావడం నిజంగా ఆశ్చర్యకరమయిన విషయం.కాకపోతే కొత్తవాళ్లతో తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మాత్రం శేఖర్ కమ్ములకి కెరీర్ పరంగా,ఫైనాన్షియల్ గా కూడా చాలా ప్రాబ్లెమ్స్ క్రియేట్ చేసింది.
మళ్ళీ ఆ సిట్యుయేషన్ రిపీట్ అవుతుందేమో అని భయపడ్డ ఈ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఈ డెసిషన్ తీసుకుని ఉంటాడు.స్క్రిప్ట్ పై పకడ్బందీగా ఉండే శేఖర్ కమ్ముల,ఫుల్ ఫీల్ తో మంచి కాఫీ లాంటి సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ఇలా టేస్ట్ లెస్ కాఫీ ని ఎలా ప్రిపేర్ చేసాడో అనేది మాత్రం నిజంగా విచిత్రం.
[INSERT_ELEMENTOR id=”3574″]