డ్రగ్స్ కేసులో తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు

shraddha kapoor also attend drug parties with sushant singh rajput

Actress Shraddha Kapoor Drug Case: సుశాంత్ సింగ్ మరణం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ ఇష్యూలో అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటపడటంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరితమైన శ్రద్దా కపూర్ పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తుండటం సంచలనంగా మారింది.

ఒక్కొక్కటిగా బయటకొస్తున్న సెలబ్రిటీల పేర్లు విని షాకవుతున్నారు పేక్షకులు. సుశాంత్ ఫామ్ హౌస్‌లో జరిగే డ్రగ్ పార్టీలకు రియా చక్రవర్తి, సారాలతో పాటు శ్రద్దాకపూర్ కూడా హాజరయ్యేదని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె గురించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సీక్రెట్‌గా అన్వేషణ మొదలుపెట్టారని ప్రస్తుతం పలు మీడియా సంస్థల వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో సాహో బ్యూటీ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే డ్రగ్స్ వాడినట్లు, డ్రగ్స్ పెడల్స్‌తో తనకు కాంటాక్ట్స్ ఉన్నట్లు ఒప్పుకున్న సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి.. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయటపెట్టడం సెన్సేషన్ అయింది. ఇప్పుడు మరో హీరోయిన్ శ్రద్దా కపూర్ పేరు కూడా బయటకు రావడం మరిన్ని అనుమానాలు లేవనెత్తింది. మరోవైపు డ్రగ్స్ మాఫియా విషయమై మీడియాలో వస్తున్న కథనాలపై రకుల్ ప్రీత్ ఫైర్ అయింది. తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని రకుల్ హైకోర్టును ఆశ్రయించింది.