ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా శ్రియ ’గమనం’

0
647
shriya saran first look poster released from gamanam movie

Happy Birthday Shriya Saran Gamanam First Look: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ .. గత ఇరవై యేళ్లుగా హీరోయిన్‌గా సత్తా చూపెడుతూనే ఉంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో ‘గమనం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించారు.

సౌత్ ఇండియన్ తెరపై దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కుల మనసు దోచుకుంటూ అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కెరీర్‌కి కాస్త గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో ‘గమనం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. సుజ‌నా రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘గ‌మ‌నం’ మూవీ రియ‌ల్ లైఫ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

శ్రియ శ‌ర‌ణ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ రోజు (సెప్టెంబర్ 11) ‘గ‌మ‌నం’ ఫిల్మ్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ విడుద‌ల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ్రియ సాధారణ మధ్యతరగతి గృహిణి పాత్రలో అలరించనున్నట్టు ఈ పోస్టర్ చూస్తూ చెప్పొచ్చు. ఈ పోస్ట‌ర్‌లో చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం మాత్ర‌మే ఉన్న ఒక అతి సాధార‌ణ గృహిణిలా శ్రియ కనిపిస్తోంది‌. ఏ విష‌యం గురించో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ఆమె ముఖంలోని భావాలు తెలుపుతున్నాయి.

ఈ సినిమాకు ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పని నడుస్తోంది. ఈ చిత్రంలో శ్రియ కాకుండా ఇంకెవరు నటిస్తున్నారనే విషయం వెల్లడించలేదు.

Previous articleకంగనాపై విశాల్ సెన్సేషనల్ కామెంట్స్..!
Next articleబిగ్ బాస్ 4 కంటెస్టెంట్ ల ఎంపిక బాలేదు… కౌశల్