Shriya Saran to be seen in ram charan and ntr rrr here are the details

RRR Shriya Saran: ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్ (JrNTR), చరణ్‌లు (Ram Charan) హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సీనియార్ హీరోయిన్ శ్రియ (Shriya Saran) ఈ సినిమాలో కీలక పాత్రపోషిస్తుందట. వీటిపై తాజాగా శ్రియ స్పందించింది .

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రపోషిస్తుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

వీటిపై తాజాగా శ్రియ స్పందించింది . ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.శ్రియ స్పందిస్తూ, సినిమాలో తన పాత్ర గురించి వివరించింది. ఈ చిత్రంలో తన పాత్ర చిన్నదేనని ఆమె తెలిపింది. ఛత్రపతి’ తర్వాత రాజమౌళితో మళ్లీ పని చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని శ్రియ తెలిపింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తో కలిసి పని చేస్తున్నానని…ఆయన ఒక గొప్ప నటుడని చెప్పుకొచ్చింది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది.