shruti haasan to romance Rana in web series

Rana – Shruti Haasan: హీరో రానా కాస్త బ్రేక్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ఈయన ‘అరణ్య’ అనే మల్టీల్యాంగేజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదే సమయంలో ‘విరాట పర్యం’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ‘విరాట పర్వం’ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ చిత్రం చేస్తున్నాడు రానా..సురేష్ బాబు ప్రముఖ అంతర్జాతీ నిర్మాణ సంస్థతో కలిసి దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్దం అయ్యారు.

ఇదిలా ఉంటే రానా, శ్రుతీహాసన్‌. ఈ ఇద్దరూ ఓ వెబ్‌ సిరీస్‌లో కలసి నటించబోతున్నారని టాక్‌. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోయే భారీ వెబ్‌ సిరీస్‌లో జంటగా నటిస్తారట రానా, శుత్రి. పది ఎపిసోడ్ల ఈ సిరీస్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఉంటుందట. స్క్రిప్ట్‌ పనులన్నీ పూర్తయ్యాయని తెలిసింది. తెలుగు భాషలో చిత్రీకరించినప్పటికీ ఈ సిరీస్‌ను మిగతా ప్రాంతీయ భాషలన్నింటిలోకి అనువదించనున్నారని సమాచారం.