“సలార్” సెట్స్ లో డైరెక్టర్‏తో శ్రుతిహాసన్ ఆటలు..!

0
385
Shruti Hassan Fun with Prashanth Neel at Prabhas Salaar sets

Salaar Shooting, Shruti Haasan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి చిత్రం ‘సలార్’. ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైద్రాబాద్ పూర్తి చేసిన మేకర్స్ నిన్ననే ‘సలార్’ మూడవ షెడ్యూల్ కు సైతం ప్యాక్ అప్ చెప్పేశారు. ప్రస్తుతం ముంబైలో నాల్గవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ ఈ రోజు ముంబైలో అడుగు పెట్టింది. ఇదిలా ఉంటే.. అటు సినిమాతోపాటు.. సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ ఎల్లప్పుడూ యాక్టివ్‏గా ఉంటూ.. అభిమానులకు టచ్‏లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. సలార్ సెట్‏లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏ను ఆట పట్టిస్తున్న వీడియోను షేర్ చేసింది శ్రుతి.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాపం శృతి రూపంలో అందమైన అల్లరి హింసను ప్రశాంత్ నీల్ ఎలా తట్టుకుంటున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ వీడియోలో కూల్ గా సరదాగా కన్పిస్తున్నారు.

Shruti Hassan Fun with Prashanth Neel at Prabhas Salaar sets

సెట్స్ లో ఫోన్ వాడటం ప్రశాంత్ నీల్ కు ఇష్టం ఉండదని.. శృతి హాసన్ మాత్రం గ్యాప్ దొరికితే ఫోన్ పట్టుకుని ఉంటుంది. అందుకే నాకు ఇష్టమైన పని అంటే ఫోన్ పట్టుకుని వీడియో తీయడం చేస్తూ ప్రశాంత్ నీల్ ను విసిగిస్తున్నట్లుగా శృతి హాసన్ పేర్కొంది.

ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది.

 

Previous articleNagarjuna Launched Pelli Sandadi Movie Teaser
Next article“ఎన్టీఆర్ 30” లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!