శ్యామ్ సింగరాయ్‌ సెట్స్‌లోకి బెంగాలి నటుడు

161
shyam-singha-roy-Movie-team-welcomes-jisshu-sengupta
shyam-singha-roy-Movie-team-welcomes-jisshu-sengupta

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టక్ జగదీష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతుంది. మరొకటి శ్యామ్ సింగరాయ్ మాత్రం కలకత్తా బ్యాక్‌డ్రాప్‌ డ్రామాగా రూపొందుతోంది.

 

 

ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే నేడు ఈ సినిమా చిత్రీకరణలో మరో విలక్షణ నటుడు పాల్గొన్నారు.

 

 

ఈ మేరకు సినిమా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అతడెవరో కాదు.. బెంగాలి నటుడు జిష్షు సేన్‌గుప్త. భీష్మ, అశ్వథామ వంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇతడు శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించనున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సేన్‌గుప్త ఎటువంటి పాత్రలో కనిపిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.