‘పుష్పక విమానం’ సిలకా ఎగిరిపోయావా సింగిల్ రిలీజ్!

188
Silakaa​ Lyrical Song | Pushpaka Vimanam Songs | Anand Deverakonda | Damodara | Ram Miriyala
Silakaa​ Lyrical Song | Pushpaka Vimanam Songs | Anand Deverakonda | Damodara | Ram Miriyala

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్పక విమానం’. ఇవాళ ఆనంద్ బర్త్ డే. ఈ సందర్భంగా అతని సినిమాలోని తొలి గీతాన్ని విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు. దామోదర దర్శకత్వంలో  విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

 

 

ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి , ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ‘‘పుష్పక విమానం” మూవీ లోని ఫస్ట్ సింగిల్ ‘‘సిలకా ఎగిరిపోయావా ఆశలన్ని ఇడిసేసి ఎనకా…సిలకా చిన్నబోయిందె సిట్టి గుండె పిట్ట నువ్వు లేక ‘‘ అంటూ సాగే ఈ పాటకు రామ్ మిరియాల సంగీతాన్ని సమకూర్చడంతో పాటు మరో గీత రచయిత ఆనంద్ గుర్రంతో కలిసి సాహిత్యాన్ని అందించారు. చమన్ బ్రదర్స్ అనే బ్యాండ్ పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ పాటలో కనిపిస్తున్నారు. వాళ్లు పాడుతూ డాన్సులు చేస్తూ పాటకు సరికొత్త జోష్ తీసుకొచ్చారు.

 

 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘పుష్పక విమానం’ త్వరలో జనం ముందుకు రానుంది. ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైన్ లో గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.