Homeట్రెండింగ్శ్రీసింహా కోడూరి `ఉస్తాద్‌` ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఆగ‌స్ట్‌లో మూవీ గ్రాండ్ రిలీజ్‌

శ్రీసింహా కోడూరి `ఉస్తాద్‌` ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఆగ‌స్ట్‌లో మూవీ గ్రాండ్ రిలీజ్‌

Simha Koduri new movie Ustaad trailer out now, USTAAD Theatrical Trailer, Ustaad Telugu movie, Ustaad Movie release date, Ustaad cast crew, Ustaad movie release date

‘మత్తువదలరా’ వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి క‌థానాయకుడిగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. ఆగస్ట్‌లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ‘ఉస్తాద్‌’ చిత్రాన్ని ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 

`ఉస్తాద్` ట్రైల‌ర్‌ను ప‌రిశీలిస్తే..సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి యువకుడు సూర్య ఆకాశంలో ఎగ‌రాల‌ని క‌ల‌లు కంటాడు. ఆ క‌ల‌ల‌ను సాధిస్తాడు. ఆ యువ‌కుడి కో పైల‌ట్ జోసెఫ్ డిసౌజా పాత్ర‌లో గౌత‌మ్ వాసుదేవ్ న‌టించారు. సూర్య పాత్ర‌లో శ్రీసింహా కోడూరి న‌టిస్తే, త‌న ప్రేయ‌సి పాత్ర‌లో కావ్యా క‌ళ్యాణ్ రామ్ నటించింది. త‌ను ప్రేమించిన అమ్మాయితో పాటు సూర్యకు త‌న ఉస్తాద్ బైక్ అంటే ఎంతో ఇష్టం. డైరెక్ట‌ర్ ఫ‌ణిదీప్ ట్రైల‌ర్‌లో సూర్య ప్ర‌పంచాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. 

శ్రీసింహ, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, అనుహాస‌న్‌, ర‌వీంద్ర విజ‌య్‌, వెంక‌టేష్ మ‌హ‌, ర‌వి శివ‌తేజ‌, సాయికిర‌ణ్ ఏడిద త‌దిత‌రులను ట్రైల‌ర్‌ను చ‌క్క‌గా చూపించారు డైరెక్ట‌ర్‌. వీరి త‌మమైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటార‌ని ట్రైల‌ర్‌తో చిన్న ట‌చ్ ఇచ్చారు. శ్రీసింహ ఇందుల మూడు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపించారు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ పాత్ర ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్‌నిస్తుంది. ఈ చిత్రానికి అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు. 

Simha Koduri new movie Ustaad trailer out now, USTAAD Theatrical Trailer, Ustaad Telugu movie, Ustaad Movie release date, Ustaad cast crew, Ustaad movie release date

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY