Homeసినిమా వార్తలురీ రిలీజ్ కు ముందే బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సింహాద్రి..!!

రీ రిలీజ్ కు ముందే బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సింహాద్రి..!!

Simhadri 4k new record at advance booking collection, Jr NTR Simhadri re release collections, Simhadri 4k will Break Kushi's Box Office Record.. NTR 30 updates, NTR30 shooting..

Simhadri 4k advance booking collection: ఎస్ఎస్ రాజమౌళి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సింహాద్రి (Simhadri 4k). ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు ఎటువంటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓ రకంగా ఎన్టీఆర్ కు స్టార్ స్టేటస్ తీసుకురావడమే కాకుండా అతనిలోని నటవిస్తూ తెరకెక్కిచ్చిన చిత్రం సింహాద్రి. అలాంటి సంచలన విజయాన్ని సాధించిన ఆ చిత్రాన్ని తిరిగి ఎన్టీఆర్ బర్త్డే ని పురస్కరించుకొని మే 20వ తారీకున ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.

Simhadri 4k advance booking collection: ఈ మూవీ విడుదల లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది…ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 4K వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ (Booking) విషయానికి వస్తే అది మరో రికార్డు అని చెప్పవచ్చు. సింహాద్రి (Simhadri) సినిమాను లేటెస్ట్ వర్షన్ ఆయిన 4 K లో భారీ రేంజ్ లో విడుదల చేస్తున్నారు.

దానితో పాటుగా 5.1 సౌండ్ సిస్టం ఎఫెక్ట్స్ ని కూడా జత చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థం కావాలి కాబట్టి దీనికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ని కూడా యాడ్ చేసేటందుకు ప్లాన్ చేస్తున్నారట. అమెరికా ఆస్ట్రేలియా మరియు జపాన్ దేశాలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ క్యారెక్టర్ కి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పాన్ వరల్డ్ స్టార్ అయ్యారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఈ చిత్రంపై భారీగానే ఉంటుందని చెప్పవచ్చు. అక్కడ కూడా ఎన్టీఆర్ (NTR) అభిమానులు విపరీతంగా ఉన్నారు కాబట్టి సింహాద్రి (Simhadri) మూవీ ని అక్కడ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకుంటే బాగుంటుంది అని మూవీ యూనిట్ ప్లాన్.

ఇటు హైదరాబాదులో కూడా సింహాద్రి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు 24 షోలు ప్రదర్శించే విధంగా ఈ మూవీకి ప్లానింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే 9 షోలకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి…మరో తొమ్మిది షోలు ఫాస్ట్ గా ఫీల్ అవుతున్నాయి..

Simhadri 4k new record at advance booking collection

- Advertisement -

మొత్తం 24 వేల టికెట్లకు గాను ఇప్పటికే 19 వేల టికెట్లు అమ్ముడైపోయాయి అంటే రిలీజ్ కి ముందే 80 శాతం ఆక్యుపెన్సి మరియు 25 లక్షల వసూలు సింహాద్రి కి సొంతమైంది. మే 19న ప్రదర్శించే ప్రీమియర్కు అమెరికాలో కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అక్కడ 63 లొకేషన్ లలో 117 షోలను ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే 10 వేల టికెట్లు అమ్ముడుపోయాయి అంటే ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఎంత ఉందో చూడండి.

Web Title: Simhadri 4k new record at advance booking collection, Jr NTR Simhadri re release collections, Simhadri 4k will Break Kushi’s Box Office Record.. NTR 30 updates, NTR30 shooting..

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY