Simran Powerfull Role In Akash Puri Romantic

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఇప్పటికే ఆకాష్ పూరి చేసిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన రిజల్ట్ అందుకోకపోవడంతో.. ఇప్పుడీ చిత్రాన్ని ఎలాగైనా మంచి హిట్ చేసి కొడుకును నిలబెట్టాలని పూరి చూస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి పూరి దర్శకత్వం వహించడం లేదు. నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన శిష్యుడు అనిల్ పాదూరిని ఈ చిత్రంతో పూరి దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఆకాష్ పూరి సరసన కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోందని తెలిసింది. అయితే ఆమెతో పాటు మరో సీనియర్ నటి సిమ్రాన్ కూడా నటిస్తోందని, అది కూడా పవర్ ఫుల్ అత్త పాత్రలో అని తెలుస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ని షేక్ చేసిన సిమ్రాన్. ఆకాష్ పూరికి అత్తగా సిమ్రాన్ ఈ చిత్రంలో చేస్తుందని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.