Singeetam Srinivasa Rao Comes On Board For Prabhas, Nag Ashwin’s Pan India Film

Prabhas Nag Ashwin: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas21) హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీకి సింగీతం శ్రీనివాసరావు సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే హీరోయిన్ గా నటించనుంది.

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే మనకు టక్కున గర్తొచ్చే సినిమా ‘ఆదిత్య 369’. ఈ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించారు సింగీతం. ఇదొక్కటేనా.. ‘పుష్పక విమానం’, ‘మయూరి’, ‘భైరవద్వీపం’ ఇలాంటి ఎన్నో గొప్ప, ప్రయోగాత్మక సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. తన క్రియేటివ్ మైండ్‌తో ఎన్నో అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించిన సింగీతం.. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మెంటర్‌గా పనిచేస్తున్నారు.

నేడు సింగీతం బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలియజేస్తూ ”మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల ఇప్పటికి నెరవేరనుంది. సింగీతం శ్రీనివాసరావు గారును మా ఎపిక్ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన క్రియేటివ్ సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి” అని తెలిపారు.