Singer Malavika Gives Clarity On Sp Balasubramanyam Health Issue

గాన గాంధర్వుడు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో బాలుకి కరోనా సోకడానికి కారణం సింగర్ మాళవిక అనే వార్తలు గుప్పుమనడంతో క్లారిటీ ఇస్తూ వీడియో వీడియో విడుద చేసింది సింగర్ మాళవిక.

బాలసుబ్రహ్మణ్యానికి కరోనా సోకడానికి కారణం తానే అని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. అందులో ఏం ఉందంటే.. నేను కరోనా టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వచ్చిన తరువాత కూడా ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో పాల్గొన్నానని.. అక్కడ నావల్ల మ్యూజిషియన్స్, సిబ్బంది అలాగే ఆ షోకి వచ్చిన ఎస్పీ బాలుకి కరోనా సోకిందని నాతో పాటు మా సిస్టర్ కూడా ఆ ఈవెంట్‌లో పాల్గొన్నట్టు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.

దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధలో ఉన్న సమయంలో నన్ను నా కుటుంబంతో దుష్ప్రచారం చేయడం దారుణం.. దయచేసి మమ్మల్ని బాధపెట్టొద్దు. ఈ ఫేక్ మెసేజ్‌ని సర్క్యూలేట్ చేయొద్దు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సింగర్ మాళవిక.