వైరల్ అవుతున్న సింగర్ సునీత రెండో పెళ్లి వార్తలు..!

0
501
Singer Sunitha getting ready for second marriage rumors going around in social media

గత రెండు రోజులుగా సింగర్ సునీత రెండో పెళ్ళికి రెడీ అవుతుంది, అతడే వరుడు అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న హింట్ దొరికినా దానికో కథ అల్లేసి కన్ఫ్యూజన్‌లో పడేస్తుంటారు. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా సింగర్ సునీత పెళ్లి వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. సునీత రెండో పెళ్లికి సిద్ధమైందని కొందరంటే.. ఆమెకు కాబోయే భర్త ఈయనే అంటూ ఇంకొందరు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. టీవీ చానల్స్ కూడా ఈ విషయమై స్పెషల్ ప్యాకేజ్స్ రన్ చేశాయంటే అర్ధం చేసుకోవచ్చు ఆ టాపిక్ ఎంత వైరల్ అయ్యింది అనేది.

తెలుగు చిత్రసీమలో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడింది. యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. కాకపోతే పెళ్లి విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. పర్సనల్ లైఫ్‌లో చాలా కష్టాలు అనుభవించింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటోంది.

ఈ నేపథ్యంలో సునీత రెండో పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇంత హడావుడి పడ్డ విషయం ఫేక్ అని స్పష్టమవుతోంది. సునీత సన్నిహిత వర్గాలను ఈ విషయమై స్పందన కోరగా.. అదేమీ లేదని, ఆ పుకార్లన్నీ ఉత్తుత్తివేనని అందుకే సునీత కూడా రెస్పాండ్ అవ్వలేదని చెప్పుకొచ్చారు. అలాగే.. సునీత తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉందని, అలాగే కెరీర్ పరంగా కూడా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉందని, రెండో పెళ్లి గురించి అసలు ఆమెకు ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here