నాగార్జున మాటని లెక్క చేయని షణ్ముఖ్, సిరి..!

0
8547
Siri's mother shocking comments on Shanmukh Jaswanth 

Shanmukh, Siri, Bigg Boss Telugu 5 – Siri’s mother shocking comments on Shanmukh Jaswanth

అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన ఏకైక తెలుగు షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5. 17 మంది స్టార్ట్ అయిన ఈ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. పాత సీజన్స్ లాగానే ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌ కుటుంబసభ్యులు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు.

ఇవాళ రిలీజ్ అయిన కొత్త ప్రోమోలో పూర్తి వినోదం మరియు షాక్‌లతో నిండిపోయింది. మానస్ తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది మరియు ప్రతి హౌస్‌మేట్ పట్ల తన వైఖరి మరియు ప్రేమతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె ప్రతి హౌస్‌మేట్‌తో బాగా సంభాషించింది మరియు ఉల్లాసమైన వినోదాన్ని సృష్టించింది.

ఆ తర్వాత సిరి హనుమంత్ (siri hanmanth) తల్లి ఇంట్లోకి ప్రవేశించి షణ్ముఖ్‌ని (Shanmukh Jaswanth) సిరి కౌగిలించుకోవడం ఇష్టం లేదంటూ షణ్ముఖ్ జస్వంత్‌కి షాక్ ఇచ్చింది. గేమ్స్‌ విషయంలో అతను సిరికి బాగా సాయం చేస్తున్నాడు. అందువల్ల సిరి అతనికి బాగా దగ్గరైపోతోంది. అది నాకు నచ్చడం లేదు. అని ఆమె చెప్పడంతో అక్కడే ఉన్న షణ్ముఖ్‌ (Shanmukh Jaswanth) ఒక్కసారిగా కంగుతిన్నారు.

Siri's mother shocking comments on Shanmukh Jaswanth 
Siri’s mother shocking comments on Shanmukh Jaswanth

లాస్ట్ వీక్ నాగార్జున కన్ఫెషన్ రూం లోకి పిలిచి మరీ క్లాస్ పీకినా సరే షణ్ముఖ్ (Shanmukh Jaswanth), సిరి (siri hanmanth) ఆయన ముందు తల ఊపి మళ్లీ తమ పంథా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మాట్లాడితే ముద్దు లేదంటే హగ్గు ఇలా ఉంది వారి పరిస్థితి. మనం ఒక షోలో ఉన్నాం. వరల్డ్ వైడ్ గా మనల్ని చూస్తుంటారు అన్న ఆలోచన లేకుండా అడిగి మరి హగ్గులు ఇచ్చుకుంటున్నారు. మరి ఈ వీకెండ్ నాగార్జున ఏమంటారో ఇద్దర్ని చూడాలి.

 

Previous articleAnasuya Bharadwaj Latest Images
Next articleజగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి.. చిరు పోస్ట్ వైరల్.!