Actor Raja Chembolu Marriage Photos, Videos, Movies, Latest Movie News

Raja Chembolu Marriage: టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు రాజా చెంబోలు వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. వైభ‌వంగా జ‌రిగిన ఈ వేడుక‌కు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్, కృష్ణ‌వంశీ, క్రిష్‌, గుణ్ణం గంగ‌రాజు, వంశీ పైడిప‌ల్లి, ప్ర‌ముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌,వెంక‌ట్ అక్కినేని, ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ త‌దిత‌రులు విచ్చేసి నూత‌న వ‌ధూవురుల‌ని ఆశీర్వ‌దించారు.

రాజా చెంబోలు కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అంతరిక్షం, ఎవడు, హ్యాపీ వెడ్డింగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఫిదా , రణరంగం, మిస్టర్ మజ్ను, ఏబీసీడీ’ వంటి ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆగ‌స్ట్‌లో వీరి నిశ్చాతార్ధం జ‌ర‌గ‌గా, ఆ వేడుక‌కి సంబంధించిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. 2020లో గొప్ప ప్ర‌యాణం .. నా కొత్త ప్ర‌యాణానికి సంతోషిస్తున్నా అని పేర్కొన్నాడు.

Check Out Raja Marriage Photo Gallery