Sita Ramam Collection: సీతారామన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రొటీన్ స్టోరీస్ కి భిన్నంగా డైరెక్టర్ ఈ సినిమాని రూపొందించారు. సినిమా మొదటి షో దగ్గర నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది అలాగే బాక్సాఫీస్ వద్ద అ కలెక్షన్స్ ని ఎవరు ఊహించని విధంగా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం అందరి మనసుని ఆకట్టుకుంది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సీతారామం.
Sita Ramam Box office collection
బాక్సాఫీస్ బరిలో రూ. 17 కోట్ల టార్గెట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక రిలీజైన ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి. ఏకంగా 26.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఎదురులేకుండా మంచి లాభాలను వెనకేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మలయాళం వర్షన్ కూడా విడుదల చేస్తున్నారు.
సెప్టెంబర్ 25న గ్రాండ్గా మలయాళం వర్షన్ ని విడుదల చేస్తున్నట్టు నిన్న సినిమా మేకర్స్ ప్రకటించడం జరిగింది. అలాగే సినిమాలలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరించడానికి సిద్ధంగా ఉంటారని నిరూపించింది సీతారామం. పెద్ద హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈ చిన్న సినిమాగా విడుదలైన సీతారామ అలాగే కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకువచ్చాయి.