Sitara And Mahesh Bbabu Participate In Ganesh Nimarjanam at home Photos Goes Viral, Mahesh Babu, Namrata, Gautham, Sitara Vinyaka Chavithi photos viral, Sitara latest photos
కుల మతాలు తేడా లేకుండా దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగని ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సాధారణ ప్రజలతో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ లో కూడా చాలామంది సెలబ్రిటీస్ వినాయక చవితి పండుగని ఘనంగా జరుపుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. గుంటూరు కారం హీరో మహేష్ బాబు ఇంట కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
మహేష్ బాబు ఇద్దరు పిల్లలు సితార (Sitara) అలాగే గౌతమ్ ఈ పండక్కి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సితార (Sitara photos) కూడా వినాయక చవితి రోజు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అదేవిధంగా ఇప్పుడు సితార అలాగే గౌతమ్ ఇద్దరు వినాయక విగ్రహాన్ని ఇంటిలోనే నిమజ్జనం చేసినట్టు ఈ ఫోటోలో మనం చూడవచ్చు.

గౌతమ్ అలాగే సితార వినాయక విగ్రహాన్ని తీసుకొని ముందుకు నడుస్తూ ఉండగా వెనుక మాల పనివాళ్ళు కూడా వచ్చారు. అనంతరం ఇద్దరూ కలిసి తమ ఇంటిలో ఏర్పాటు చేసినటువంటి ఒక డ్రమ్ములో వినాయకుడి నిమర్జనం చేశారు. సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలని నమ్రత తన సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.