‘సిత్తరాలా సిరపడు’ లిరికల్ వీడియో చూశారా ?

0
288
Sittharala Sirapadu Lyrical Video From Ala Vaikunthapurramuloo Movie
Sittharala Sirapadu Lyrical Video From Ala Vaikunthapurramuloo Movie

(Sittharala Sirapadu Lyrical Video From Ala Vaikunthapurramuloo Movie)స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. అల వైకుంఠపురంలో మూవీలో దర్శకుడు త్రివిక్రమ్ చాలా ప్రయోగాలే చేశారు. సంక్రాంతి విజేతగా నిలిచింది. ఐతే, ఈ సినిమా రిలీజ్ కి ముందు వరకి రెండు విషయాలు దాచినట్టు దర్శకుడు త్రివిక్రమ్ తెలిపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా శ్రీకాకుళం స్లాంగ్ లో పల్లెటూరి జానపదంలా సాగే ఓ పాటలో మెస్మరైజింగ్ ఫైట్ రూపొందించాడు.

దీనితో ఈ ఫైట్ సీక్వెన్స్ లో వాడిన సిత్తరాల సిరపడు సాంగ్ లిరికల్ వీడియోని నేడు విడుదల చేశారు. థమన్ స్వరాలకు సూరన్న, సాకేత్ అద్బుతంగా పాడారు. అల వైకుంఠపురంలో చిత్రంలోని గత సాంగ్స్ వలే ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఏడాదిన్నర తరువాత ఓ మూవీతో వచ్చిన బన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను థియేటర్లలో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వెర్షన్‌లో సాగే ఈ పాట లిరికల్ వీడియోను మీరు చూసేయండీ.. !

 

Previous articleఅనుష్క.నిశ్శబ్దం లుక్ అదిరిపోయింది
Next articleఅసలు వైకుంఠపురము ఇల్లు ఇదే..!