siva balaji wife madhumitha emotional on live interview

Siva Balaji: Madhumitha: ప్రైవేట్ పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ ఇటీవలే శివ బాలాజీ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే ఇష్యూపై రియాక్ట్ అవుతూ లైవ్ లోనే ఎమోషనల్ అయింది శివ బాలాజీ భార్య మధుమిత. హైదరాబాద్ నగరంలోని మణికొండలో ఉన్న మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యంపై ఆయన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో హాట్ టాపిక్ అయిన ఈ ఇష్యూపై పలు మీడియా సంస్థలు చర్చావేదికలు పెట్టాయి.

మధుమిత లైవ్ లో మాట్లాడుతూ తమ పిల్లల గురించి మాత్రమే తాము ఇదంతా చేయలేదని.. ఇలాంటి ఎన్నో విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మౌంట్ లిటేరా జీ స్కూల్ లో పని చేసిన ఓ లేడీ టీచర్ ఈ లైవ్ లోకి వచ్చి మాట్లాడుతూ.. తాను ఆ స్కూల్ లో సంవత్సరం పాటు టీచర్ గా వర్క్ చేశానని అదే సమయంలో తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే.. ‘నీకెందుకు ఈ టైమ్ లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని’ స్కూల్ యాజమాన్యం అడిగిందని చెప్పుకొచ్చింది. ఇది విని లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంటూ స్కూల్ యాజమాన్యంపై ఫైర్ అయింది మధుమిత.

మరోవైపు శివబాలాజీ ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సీ).. మౌంట్‌ లిటేరా జీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీనిపై సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రైవేట్ పాఠశాల వ్యవహారం, ఫీజుల ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.