Homeసినిమా వార్తలురామ్ ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ “నీ చుట్టు చుట్టు” ఆగస్ట్ 3న విడుదల.!

రామ్ ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ “నీ చుట్టు చుట్టు” ఆగస్ట్ 3న విడుదల.!

Ram Pothineni, Sreeleela, Skanda Movie First Single Release Date confirmed

Skanda Movie First Single Release Date:  బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మరియు ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) మోస్ట్ ఎవెయిటింగ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ టైటిల్ గ్లిమ్ప్స్ సూపర్ రెస్పాన్స్ తో సోషల్ మీడియా లో దూసుకు వెళ్ళింది. ది ఎటాకర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్ మరియు బోయపాటి శ్రీను,,రామ్‌ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌ లో చూపించాడు.

Skanda Movie First Single Release Date: ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సింగిల్ “నీ చుట్టు చుట్టు” ప్రోమో ఆగస్టు 1వ తేదీన ఉదయం 10:26 గంటలకు విడుదల కానుంది. ఈ డ్యాన్స్ నంబర్ ఫుల్ లిరికల్ వీడియో ఆగస్టు 3న ఉదయం 9:26 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

రామ్ మందపాటి గడ్డంతో మాస్‌ గా కనిపిస్తుండగా, శ్రీలీల (Sreeleela) మెరిసే వేషధారణలో గ్లామర్‌గా కనిపిస్తుంది. పోస్టర్ సూచించినట్లుగా ఇది ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌ గా ఉండబోతోంది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమా కోసం ఒక రాకింగ్ ఆల్బమ్ చేశాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు మరియు నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరా క్రాంక్ చేశారు.

Skanda Movie First Single Release Date confirmed
Skanda Movie First Single Release Date confirmed

దీనిని జీ స్టూడియోస్ సౌత్ మరియు పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా స్కంద విడుదలకు సిద్ధమవుతోంది.

Ram Pothineni, Sreeleela, Skanda Movie First Single Release Date confirmed, Skanda songs, Skanda movie release date, RAPO next movie details, Skanda trailer release date

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY