సత్య దేవ్ స్కైల్యాబ్ రివ్యూ

0
2759
Skylab Telugu Movie Review Rating
Skylab Telugu Movie Review Rating

Skylab Telugu Movie Review & Rating
విడుదల తేదీ : డిసెంబర్ 04, 2021
రేటింగ్ : 2.5/5
నటీనటులు: సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి తదితరులు
దర్శకత్వం : విశ్వక్ ఖండేరావు
నిర్మాతలు: నిత్యా మీనన్, ప్రవల్లిక పిన్నమరాజు, పృథ్వీ పిన్నమరాజు
సంగీత దర్శకుడు: ప్రశాంత్ విహారి

SkyLab Review: నిత్యా మీనన్ మరియు సత్య దేవ్ విభిన్నమైన స్క్రిప్ట్‌లను ఎంచుకునే ప్రతిభావంతులైన నటులు. వీళ్ళు ఇద్దరు కలిసి నటించిన ‘స్కైల్యాబ్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. సినిమాలో న‌టించ‌డంతో పాటు స‌హ నిర్మాత‌గా వ్య‌వహ‌రించారు నిత్యా మీన‌న్. హీరోయిన్ నిర్మాత‌గా మార‌డం, ప్ర‌చార చిత్రాలు సినిమాపై ఆస‌క్తి పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి..

కథ:
1970వ సంవత్సరం సంబంధించిన కాదుగా చిత్రీకరించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతమైన బండలింగంపల్లిలో గౌరి (నిత్య మీనన్) ఒక జమీందార్ కుమార్తె. గౌరి ప్రతిబింబం అనే పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తోంది. ఆమె ఎప్పటికైనా రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్) తన డాక్టర్ లైసెన్స్‌ని తిరిగి పొందడానికి పెన్షన్ పొందిన తన తాత (తనికెళ్ల భరణి) నుండి ఆర్థిక సహాయం కోసం గ్రామంలో అడుగుపెడతాడు.

డాక్టర్ ఆనంద్ (సత్య దేవ్) గౌరి గ్రామంలోనే క్లినిక్ పెట్టి డబ్బు సంపాదించడం కోసం సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ)తో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. గౌరీ ఊరు వచ్చిన తర్వాత ప్రతిబింబం ఆఫీసు నుంచి ఓ ఉత్తరం వస్తుంది. అందులో ఏముంది? మరి ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు ఏమిటి ? అమెరికా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ ‘స్కైలాబ్’ శకలాలు భూమ్మీద పడతాయనే వార్త ఈ ముగ్గురి జీవితాల్లో ఎటువంటి ప్రభావం చూపింది? అనేది మిగిలిన కథ.

Skylab Telugu Movie Review Rating
Skylab Telugu Movie Review Rating

ప్ల‌స్ పాయింట్స్
ఆసక్తికరమైన కాన్సెప్ట్

మైన‌స్ పాయింట్స్
హాస్యం లేకపోవడం
నెమ్మదిగా సాగే స్టోరీ

నటీనటులు:
జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయాన్ని నిత్య మీనన్ చక్కగా పలికించింది. డాక్టర్ గా సత్య దేవ్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్వక్ ఖండేరావు రాసుకున్న కథలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. సినిమా స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫర్ ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం పర్వాలేదు.

Skylab Telugu Movie Review Rating
Skylab Telugu Movie Review Rating

విశ్లేషణ:
ఓ ఊరిలోని అమాయకపు ప్రజల కథ. ‘స్కైలాబ్’ అనేది ఈ సినిమాకు షుగర్ కోటెడ్ పిల్ లాంటిది. కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ పరంగా పర్వాలేదు అనిపించినా దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు , కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అంటే.. ఈ కథలోని మెయిన్ పాయింట్, అలాగే ఈ కథ జరిగిన నేపథ్యమే. దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు రాసుకున్న సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు కొన్నో చోట్ల బాగానే ఆకట్టుకున్నాయి.

ఊహా ప్రపంచంలో బతికేవాళ్లు, ఏదో జరుగుతోందని భయపడేవాళ్లు, అమాయకులు… సినిమాలో అందరూ ఉన్నారు. వాళ్లలో వచ్చే మార్పు ఉంది. అప్పట్లో మనుషుల మధ్య వివక్షను గొడవల రూపంలో కాకుండా కొత్త కోణంలో చూపించింది. మంచి కథ ఉంది. సన్నివేశాలు బావున్నా… కథను క్లుప్తంగా చెప్పడంలో దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఫెయిల్ అయ్యారు.

ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అయినా స్కై ల్యాబ్ అనే పాయింట్ చుట్టూ కథను నడుపుతూ కూడా దర్శకుడు కథలో ఎక్కడ టర్నింగ్ పాయింట్లు కూడా లేకుండా.. చివరి వరకూ సింగిల్ ప్లాట్ తోనే ప్లేను చాలా బోరింగ్ గా నడపడంతో సినిమా ఎవరికీ కనెక్ట్ కాదు. మధ్య మధ్యలో నిత్యా మీనన్ సీన్స్ కొన్ని నవ్వించాయి. సెకండాఫ్ లో, అదీ పతాక సన్నివేశాలు వచ్చేసరికి కథ ముందుకు కదిలింది. క్లైమాక్స్ సీన్స్, డైలాగ్స్ బాగున్నాయి. అయితే… అప్పటి వరకూ నత్త నడకన సాగిన సినిమాను చూడటం ప్రేక్షకులకు కొంచెం కష్టమే.

ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా అసలు మెప్పించదు. అదేవిధంగా 1970 నాటి తెలంగాణ నేపథ్యాన్ని కూడా సినిమాలో ఎలివేట్ చేయలేకపోయారు. మొత్తం మీద ఈ సినిమాలో కొన్ని అంశాల్లో ఆకట్టుకున్నా.. స్లో నేరేషన్, సినిమాలో బోరింగ్ ట్రీట్మెంట్ ఎక్కువవడం, బలమైన ఆగలేక పోవటం. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఈ వీకెండ్లో ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు..

 

Previous articleNivetha Pethuraj Latest Stills
Next articleఅడవి తల్లి మాట మరో బ్లాక్ బస్టర్ సాంగ్..!