‘సమ్మతమే’ సినిమా షూటింగ్ మొదలైంది

0
130
'సమ్మతమే' సినిమా షూటింగ్ మొదలైంది
'సమ్మతమే' సినిమా షూటింగ్ మొదలైంది

రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కిరణ్ అబ్బవరమ్ మరోసారి సరికొత్త కథతో మన ముందుకు రానున్నాడు. కిరణ్ చేస్తున్న సరికొత్త సినిమాకు సమ్మతమే అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందిని చౌదరీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని గోపీనాథ్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన అందుకున్నాయి.

 

 

అయితే నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను ప్రారంభించుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిచనున్నాడు. కిరణ్, చాందినీ ఇద్దరు తమ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో వీరిద్దరి తదుపరి చిత్రం కానున్న ‘సమ్మతమే’ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి వీరి జంట ఆ అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

Previous articleదసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఆర్ఆర్ఆర్’
Next article‘అయ్యప్పన్ కోషియమ్’లో పవన్ సరసన సాయిపల్లవి