social Media Troll On Prabhas: స్టార్ హీరో ప్రభాస్ అనగానే పాన్ ఇండియా బ్రాండ్ అనే మాట మనకు ముందుగా గుర్తుకొస్తుంది. కానీ ఈ స్థాయికి రావడానికి అయన చేసిన కష్టం, తీసుకున్న ప్రయాణం అందరికీ తెలిసిందే. అలాంటి ప్రభాస్‌పై, తాజాగా సోషల్ మీడియాలో ఊహించని నెగిటివిటీ వెదజల్లబడుతుంది.
కల్కి 2898 AD వివాదం – వాస్తవం ఏంటి?
ప్రభాస్ తాజా సెన్సేషనల్ హిట్ అయిన కల్కి 2898 AD నుంచి కొన్ని VFX బ్రేక్‌డౌన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, కొన్నిసీన్స్ లో ప్రభాస్ స్థానంలో డూప్ ఉపయోగించారని అంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే, ఇది నిజంగా అంత పెద్ద విషయమా?
ఇండస్ట్రీలో డూప్స్ – కామన్ ప్రాక్టీస్!
సినిమాల్లో డూప్స్ వాడటం సాధారణమైన విషయం. చిన్నసినిమా నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకూ, స్టంట్ సీన్స్, రిస్కీ షాట్స్ లో డూప్స్ ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఇదొక సజావుగా జరిగే ప్రక్రియ, అది ప్రభాస్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాల్లో టాప్ హీరోలు అందరూ ఫాలో అవుతున్న విధానం.
తాజాగా SS రాజమౌళి గారు కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు. RRR లాంటి గ్లోబల్ సెన్సేషన్ లో కూడా పార్లల్ షూట్స్ చాలా చోట్ల జరిగాయి. అంటే, ఒకే సీన్ ని ముఖ్య నటులతో పాటు, డూప్స్ తో కూడా షూట్ చేస్తారు, ఎందుకంటే ఇది సినిమా మేకింగ్ లో ఒక భాగం.
ఇది వాంటెడ్ నెగిటివిటీ?
ఈ విషయం గురించి లోతుగా ఆలోచిస్తే, ఇదంతా కావాలని సృష్టించబడిన నెగిటివిటీ అని అనిపించక మానదు. ఎందుకంటే, తెలుగు సినిమా తరహా ప్రాముఖ్యత పెరుగుతుంటే, మన హీరోలపై ఇలా ట్రోలింగ్ చేయడం సరికాదని స్పష్టంగా అర్థమవుతుంది.
తెలుగు హీరోల ప్రఖ్యాతిని తగ్గించకండి!
ఇప్పుడు మన హీరోలు తెలుగు సినిమా గొప్పతనాన్ని పాన్ వరల్డ్ లెవెల్‌కి తీసుకెళ్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం ఫ్యాన్ వార్స్ పేరుతో మన నటులను వెనక్కి లాగాలని చూస్తున్నారు. ఒకవేళ వారిని సపోర్ట్ చేయలేకపోయినా, కనీసం వెనుకేసుకు పోయే ప్రయత్నం చేయొద్దు!
ప్రభాస్ లాంటి స్టార్ కష్టం, డెడికేషన్ కు ఈ రకమైన నెగిటివిటీ తగదు! తెలుగు సినిమా ముందుకు వెళ్లాలి కానీ, మనమే మన హీరోలను వెనక్కి లాగొద్దు!