Sohel Mr.Pregnant Official Trailer: బిగ్బాస్ విన్నర్ సయ్యద్ సోహెల్ రాబోయే సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూపించిన సోహెల్ ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ ని విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేలాగా చేశారు. ఒక మగవాడు గర్బంధాలిస్తే ఎలా ఉంటుందో అనే పాయింట్ని తీసుకొని ప్రయోగాత్మకంగా ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ నెల 18న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.
Sohel Mr.Pregnant Official Trailer: మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేమ మరియు పెళ్లితో జీవితం ఊహించని మలుపు తిరుగుతున్న నిర్లక్ష్యపు యువకుడి చుట్టూ సినిమా తిరుగుతుంది. మొదటిగా విడుదల చేసిన టీజర్ లో కామెడీ యాంగిల్ చూపించగా ఈ ట్రైలర్లో కామెడీ.. ఫ్యామిలీ సెంటిమెంట్ అలాగే ఎమోషనల్ టచ్ ఇవ్వటం జరిగింది.
నేనున్నాను అంటూ తన కడుపులో ఉన్న బేబీతో చెప్పే డైలగ్.. మనసులను హత్తుకుంది. మొత్తంగా సోహెల్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎమోషన్ సీన్లను బాగానే హ్యాండిల్ చేసినట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో సుహాసిని, బ్రహ్మాజీ, అలీ, రాజా రవీంద్ర, వైవా హర్ష తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.‘ శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వ్యవహరించగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందించారు.