`హే.. ఇది నేనేనా`.. ప్రేమలో పడ్డాడు తేజ్ అలియాస్ విరాట్

0
280
Solo Brathuke So Better_ Finally Sai Dharam Tej Fall In Love Secret Revealed

ముందుగా చేపినట్లుగానే మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అసలు విషయం బయటపెట్టేశాడు. ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేమలో పడిపోయాడట. నిన్న (ఆదివారం) ప్రభాస్‌కు సారీ చెబుతూ ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆసక్తి రేకెత్తించిన సాయి ధరమ్ తేజ్.. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ చేస్తూ ప్రకటన ఇచ్చేశాడు. సరిగ్గా చెప్పిన సమయానికే ఆయన పేల్చిన బాంబ్ మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మరి సాయి తేజ్ చెప్పిన ఆ సీక్రెట్ ఏంటో చూద్దామా..

సోలో బ్రతుకే సో బెటర్ అంటూనే ఎవరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు తేజ్ అలియాస్ విరాట్. “అంత స్ట్రిక్ట్గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృతని చూసాక ఏమైంది ??? “ అని ట్యాగ్ చేస్తూ తన తాజా సినిమా `సోలో బ్రతుకే సో బెటర్` నుంచి `హే.. ఇది నేనేనా` సాంగ్ విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ పాటను ఆగష్టు 26 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. సోలో కుర్రాడు ఇలా అమ్మాయికి పడిపోవడం ఏమిటో? ఇది బ్యాచిలర్ సంఘానికే అవమానం బ్రదర్!