‘సన్ ఆఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్

0
129
son-of-india-first-look-releasedson-of-india-first-look-released
son-of-india-first-look-released

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తాజాగా చేస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాలో మోహన్ బాబు లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూసిన మంచు అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

మోహన్ బాబు మ్యానిరిజానికి తగ్గట్టుగా పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో హీరో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విరూపాక్ష అనే పాత్ర మోహన్ బాబు కనిపించనున్నారు. అదేవిధంగా శ్రీకాంత్ కూడా మమేంద్రభూపతి అనే పాత్ర చేస్తున్నారు. వీరితో పాటుగా తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, రఘు బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మోహన్ బాబు అభిమానులు తారాస్థాయి అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Previous article‘పుష‍్ప’ షూటింగ్‌లో స్టిల్ ఫోటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి
Next articleRRR’s Olivia Morris’ first look poster