మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ

0
25
Sonakshi sinha to romance with Chiranjeevi Bobby movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి ప్రస్తుతం లైన్ లో పెట్టిన సినిమాలలో డైరెక్టర్ బాబీ ప్రాజెక్ట్ ఒకటి. 

అయితే ఈ సినిమాలో చిరు సరసన నటించబోయే హీరోయిన్ గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇందులో ఫీమేల్ లీడ్ కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ను సంప్రదింపులు జరుపుతున్నారట.  మెగాస్టార్ కు జోడీగా సోనాక్షి సరిగ్గా సెట్ అవుతుందని బాబీ ఆమెను సంప్రదించాడట.  ఇదిలా ఉంటే ఇప్పటికే మెగాస్టార్ కోసం అద్భుతమైన కథను సిద్దమా చేసే పనిలో ఉన్నాడు బాబీ.

రజినీకాంత్ హీరోగా నటించిన ‘లింగా’ సినిమాతో సోనాక్షి సౌత్ లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.