song shoot on rajendra prasad, kalyan dev from the movie super machi in hyderbad

kalyan dev Super Machi Movie: కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేశాక ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కల్యాణ్ దేవ్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్ లపై హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, ఆనీ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు.

ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటతో పాటు మరో పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిర్వహిస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు ఎస్సెట్ కానున్నాయి.