థర్డ్ వేవ్ పై కామెంట్స్ చేసిన సోనూ సూద్..!

Sonu Sood: కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న మొదటి నుంచి సోనూసూద్ పేరు వార్తల్లో ఉంది. కరోనాకు ఏమాత్రం జంకకుండా బయటకు రావడమే కాకుండా వలస కార్మికులకు ఆయన చేసిన సేవ హైలెట్ అయ్యింది. కరోనా సమయంలో ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎంతో మందికి తన చేతనైన సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి చేపట్టిన “దేశ్ కే మెంటర్” అనే మంచి కార్యక్రమానికి సోనూసూద్ ను బ్రాండ్ అంబాసిడర్ ను చేశారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని చెప్పే సోనూసూద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాస్య చతురతతో అందరినీ ఆకట్టుకుంటాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది.

అయితే ఈ మధ్య సోనూ సూద్ ను ఒక వ్యక్తి కరోనా థర్డ్ వేవ్ పై మీరు ఎలా అనుకుంటున్నారు.. థర్డ్ వేవ్ వస్తుందని మీరు కూడా భావిస్తున్నారా అని అడిగాడట.. ఆ విషయాంపై ఇప్పుడు సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం ప్రెసెంట్ థర్డ్ వేవ్ ను అనుభవిస్తున్నామని ఆయన అన్నారు..

Sonu Sood Comments On COVID third wave

పేదరికం, నిరుద్యోగం కంటే కరోనా థర్డ్ వేవ్ ఎక్కువ కాదు అని ఆయన కామెంట్స్ చేసారు.. ఇది పోవాలంటే అందరు ముందుకు వచ్చి నిరు పేదలకు సహాయం చేయడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించండి అంటూ ఆయన తెలిపారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles