బిగ్ డే అంటూ ట్వీట్..మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనుసూద్‌..!

Sonu Sood: కరోనా కష్టకాలం నుంచి మొదలైన బాలీవుడ్ నటుడు సోనుసూద్ సేవలు నేటికి కొనసాగుతున్నాయి. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్నారు. తాజాగా మరో ప్రాణాన్ని నిలబెట్టారు సోనుసూద్. ఓ చిన్నారికి కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స చేయించారు. బాలుడి కుటుంబ సభ్యులు సోనుసూద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ మద్దతు వలన శుభమ్ కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు శుభమ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మీ సహాయానికి ధన్యవాదాలు!” అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సోనూసూద్.. బిగ్ డే.. ఈ మధ్య కాలంలో చాలా క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స ఒకటి సూపర్ సక్సెస్. సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.

ఎప్పటి కప్పుడు దేశంలో నెలకొంటున్న పరిస్థితులను గమనిస్తున్న సోనూ వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆయనకి కొందరు గుడులు కట్టి పూజిస్తున్నారు.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles