sonu sood helps a telangana boy who suffer from liver problem

sonu sood: లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని గమ్య స్థానాలకు చేర్చేందుకు బస్సులు, విమానాలను ఏర్పాటు చేసి సోనూసూద్ వారిని వారి సొంత గ్రామాలకు చేర్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడు మొదలు పెట్టిన మంచిపనులను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల సోనూ పేద విద్యార్థుల‌ కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ బాలుడికి 20 లక్షల సాయం సహాయం చేయటానికి ముందుకు వచ్చాడు..

ఇక ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన బాలుడికి వైద్య సహాయం కోసం ఆయన ముందుకొచ్చారు. డోర్నకల్ మండలం పెరుమాండ్లకు చెందిన బాలుడు హర్షవర్ధన్ కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు సోనూసుద్‌ను కలిసి వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని వివరించారు. చలించిపోయిన సోనూసూద్ బాలుడి వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు.