ఎస్పీ బాలు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..!

SP Balasubrahmanyam health update

డాక్టర్ల కృషి.. కోట్లాది మంచి అభిమానుల పూజలు ఫలించడంతో ఎస్పీ బాలు (SPB Health) కోలుకుంటున్నారు. కరోనా (Corona) పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (SPB Health) ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. క్రిటికల్ కండిషన్ నుంచి ఆయన కోలుకుంటున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై ఎంజీఎం వైద్యులు తెలిపారు.

మరోవైపు బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నాన్న ఆరోగ్యం వరుసగా నాలుగో రోజూ నిలకడగా ఉందని, దేవుని దయతో ఈ వీకెండ్ వరకు అభిమానులు సంతోషకరమైన వార్త వింటారు. అభిమానులు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారు. వీరి ప్రార్థనల ఫలితంగా ఈ సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ఎస్పీ తనయుడు చరణ్ ఇన్ స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *