sp balasubrahmanyam no more tollywood celebrities paid tributes to him

SP Balasubrahmanyam : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ కాసేపటి క్రితమే మధ్యాహ్నం 01గం.04 నిమిషాలకు తుది శ్వాస విడిశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతికి సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో హీరో మహేశ్‌ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.

చిరంజీవి

`సంగీత ప్రపంచానికి చీకటి రోజు. సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణం మృతితో ఓ శకం ముగిసింది. నాకు బాలుగారు ఎన్నో పాటలు పాడారు. నా విజయంలో ఆయన గాత్రానికి కూడా ప్రధాన పాత్ర ఇవ్వాలి. దిగ్గజ గాయకుడు ఘంటసాల తర్వాత ఎవరు ఉన్నారని సంగీత ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలో ఓ ధ్రువ తార ఎస్పీ బాలు రూపంలో అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మందిని దశాబ్దాలు పాటు బాలు తన గాత్రంతో అలరించారు. బాలు లాంటి మరో వ్యక్తి లేరు. ఆయనే మళ్లీ పుట్టి ఆ లోటును పూరించాలి. ఆయణ్ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాల`ని చిరంజీవి పేర్కొన్నారు.

మహేష్ బాబు

“ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయనలాంటి వాయిస్‌ ఎవరికీ ఉండదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన లెగసీ అమరం. ఆయన కుటుంబానికి నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను” అన్నారు మహేశ్‌.

కొరటాల శివ

“బాలు గారు ఇక లేరు అనటం తప్పు. పాట ఉన్నంత కాలం ఆయన మన మధ్యే ఉంటారు. కాని ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేని నిజం. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు” అన్నారు కొరటాల.

వెంకటేశ్‌

“ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంగారు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారనే వార్త ఎంతో బాధాకరం. ఈరోజు మనం ఒక లెజెండ్‌ను కోల్పోయాం. నా కెరీర్‌లో ప్రేమ, పవిత్రబంధం వంటి చిత్రాల్లో ఆయనతోకలిసి నటించే గౌరవాన్ని దక్కించుకున్నాను. మీ లెగసీ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను” అని తెలిపారు వెంకటేశ్‌.

తారక్

తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే’ అని ట్వీట్ చేశారు.

సల్మాన్ ఖాన్

“బాల సుబ్రమణ్యం సార్, కోట్ల మంది ప్రజలు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు మరియు మీ దిల్ దీవానా హీరో ప్రేమ్ (సల్మాన్ ఖాన్ యొక్క 1989 చిత్రం మైనే ప్యార్ కియాలో పాత్ర . లవ్ యు, సర్.” అని పేర్కొన్నారు.