కరోనా బారిన పడిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. తాజాగా ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందిస్తూ కరోనా నుంచి బాలు కోలుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, తాజాగా చేసిన టెస్టుల్లో కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు. ఈ గుడ్ న్యూస్ తెలియడంతో అశేష సినీ లోకంలో ఆనందం చిగురించింది.
ప్రముఖ సింగర్ ఎస్పీ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం హెల్త్ అప్డేట్ను ఆస్పత్రి నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. విదేశీ వైద్య నిపుణులు అందిస్తున్న సూచనల మేరకు ఎస్పీబీకి చికిత్సలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర చికిత్సా విభాగంలో వెంటిలేటర్, ఎక్మో పరికరంతో చికిత్స అందిస్తున్నట్టు వారు వెల్లడించారు. ఎక్మో పరికరం సాయంతో బాలుకు చికిత్స అందిస్తున్నామని వివరించారు.