sp balasubramaniam funeral will be held on tomorrow

sp balasubramaniam funeral: ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. బాలు పార్థివదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి నుంచి చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. రెడ్‌హిల్స్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రేపు ఉదయం వరకు ఇంటి వద్దనే బాలు భౌతికకాయం ఉండనుంది. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం నివాసంలో ఏర్పాట్లు చేశారు. బాలును కడసారి చూసేందుకు ఆయన నివాసం వద్దకు ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకున్నారు. మరోవైపు రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీగా పోలీస్‌ బందోబస్త్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో తమరాయిపక్కంలోని ఆయన ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.