Homeట్రెండింగ్గూస్ బంప్స్ క్రియేట్ చేస్తున్న నిఖిల్ స్పై మూవీ ట్రైలర్…!

గూస్ బంప్స్ క్రియేట్ చేస్తున్న నిఖిల్ స్పై మూవీ ట్రైలర్…!

SPY movie teaser create record views in youtube, Nikhil Siddhartha, Aryan Rajesh, Iswarya Menon SPY Movie Teaser, SPY movie Release Date, SPY shooting update

SPY movie teaser: గత సంవత్సరం కార్తికేయ 2 మూవీతో చిన్న బడ్జెట్ సినిమాగా వెంటనే భారీ సక్సెస్ అందుకొని ఇటు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా బాగా పాపులర్ అయినప్పుడు నిఖిల్ సిద్ధార్థ. చిన్న సినిమాగా బరిలోకి దిగి ఎవరు ఊహించని రేంజ్ లో రికార్డులు సృష్టించిన కార్తికేయ 2 మూవీ స్టోరీ కృష్ణుడి కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. నిఖిల్ ఆ తర్వాత 18 పేజెస్ మూవీలో నటించారు. మరి ఇప్పుడు స్పై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నారు.

SPY movie teaser: ఈడీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కే రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.గ్యారీ బీహెచ్ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఐశ్వర్య మీనన్ మరియు సన్యా ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ మరియు అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలు పోషించారు. స్పై మూవీ లో నిఖిల్ మోడల్ స్పై టైప్ లో జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ మూవీ దివంగత స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్టోరీ. ఆయన మరణం వెనక ఉన్న మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ స్పై చిత్రాలు కంటెంట్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదలైన టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా మూవీ పై హైపును పెంచుతుంది.

ఈ మూవీ ట్రైలర్ ఢిల్లీలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్ అయినటువంటి కర్తవ్య పథ్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ టీజర్ స్టార్టింగ్ సీన్ మకరంద దేశ్ పాండే మరియు అతని టీంకు భగవాన్ జి ఫైల్స్ గురించి వివరిస్తున్న సందర్భం నుంచి మొదలవుతుంది. స్వతంత్రం సాధించి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా మిస్టరీగా మిగిలిపోయిన ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త మరియు మిషనరీ మ్యాన్ గా పేరు పొందిన సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక రహస్యాలను ఛేదించే కోణంలో ఈ సినిమా సాగుతుంది.

మంచి కాంట్రవర్సీ కాన్సెప్ట్ అయినప్పటికీ.. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని అర్థమవుతుంది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారు అనడం కేవలం ఒక వరం స్టోరీగా దేశ్ పాండే పేర్కొనడం.. ఆ తర్వాత ఈ మిస్టరీని సాల్వ్ చేసే బాధ్యత గూడచారి అయిన నిక్కినకు అప్పగించడం.. ట్రైలర్లో చూడవచ్చు.

Nikhil next national thriller SPY Teaser Released
Nikhil next national thriller SPY Teaser Released

అయితే తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నిఖిల్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటారు.. ఎలా తుదికి నిజాన్ని కనుక్కుంటాడు అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ మిగతా కథ సాగుతుంది. గూడచారి క్యారెక్టర్ లో నిఖిల్ యాక్షన్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది.. మేకర్స్ అనుకున్నట్లుగానే ఈ టీజర్ ప్రేక్షకులలో ఫ్యూరియాసిటీని పెంచడంతోపాటు సినిమాపై అంచనాలను కూడా బాగానే పెంచింది.

- Advertisement -

Web Title: SPY movie teaser create record views in youtube, Nikhil Siddhartha, Aryan Rajesh, Iswarya Menon SPY Movie Teaser, SPY movie Release Date, SPY shooting update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY