రేపు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ టీజర్ రిలీజ్

0
154
sr-kalyana-mandapam-teaser-releasing-on-feb-4th
sr-kalyana-mandapam-teaser-releasing-on-feb-4th

టాలీవుడ్‌లో సినిమా అప్‌డేట్‌ల వర్షం కురుస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక సినిమా నుంచి పోస్టర్, టీజర్, రిలీజ్ డేట్ ఇలా ఎదో ఒక అప్‌డేట్ వస్తూ సినిమాలపై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కతున్న ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా టీజర్ రేపు రిలీజ్ అవుతందని సినిమా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా చేస్తున్నారు.

 

 

ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 11గంటల 25 నిమిషాలకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కొత్త తరహా కథతో తెరకెక్కుతుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

 

 

ఈ సినిమాను శ్రీధర్ దర్శకత్వంలో ప్రమోద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్, యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న  ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో సినిమా అలరిస్తుందేమో వేచి చూడాలి.

Previous articleకానీ మేము మీలా దేశాన్ని అమ్మడం లేదు..కంగనా
Next article‘శాకుంతలం’ సినిమా కోసంప్రత్యకమైన చీర‌లు