ఎస్ఆర్ కళ్యాణమండపం ( ESTD 1975 ) టీజర్ రిలీజ్

435
SR Kalyanamandapam Teaser
SR Kalyanamandapam Teaser

టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమా అప్‌డేట్‌ల వర్షం కురుస్తుంది. రోజుకో కొత్త సినిమాను నుంచి పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్, రిలీజ్ డేట్ అంటూ ఏదోఒక అప్‌డేట్ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాకుండా ఈ అప్‌డేట్‌లతో సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నారు. అయితే తాజాగా అబ్బవరం కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా టీజర్ విడుదలైంది.

 

 

ఈసినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటించారు. అంతేకాకుండా ఈ సినిమా టీజర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ‘ఏ అన్నో మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా’ అంటూ మొదలయ్యే టీజర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను శ్రీధర్ దర్శకత్వంలో ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తుంది. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.