sravani suicide case sai krishna shocking comments on devaraj

Sai Krishna: Sravani Suicide Case: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీని తలపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దేవరాజ్, సాయి కృష్ణ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తాజాగా సాయి కృష్ణ స్పందిస్తూ శ్రావణి ఆత్మహత్యకు దేవరాజే కారణమని అన్నాడు.

నటి శ్రావణి ఆత్మహత్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది. ఈ కేసులో తొలుత దేవరాజ్ ను అనుమానించిన పోలీసులు… అతడిని విచారించిన తర్వాత ఇప్పుడు సాయికృష్ణారెడ్డిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయి కృష్ణతో పాటు ఆమె కుటుంబ సభ్యులను మరికొద్ది సేపట్లో విచారించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సాయి కృష్ణ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ దేవరాజ్‌ బాగోతం ఇదీ, శ్రావణి ఆత్మహత్యకు వాడే కారణం అంటూ అతని గురించి ఎన్నో విషయాలు బయటపెట్టాడు.

శ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజు రెడ్డి అని బలంగా ఆరోపిస్తున్నాడు సాయి కృష్ణ. అతనే శ్రావణిని మానసికంగా వేధించాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. తనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సాయి… పోలీసుల ఎదుట విచారణకు హాజరువుతున్నానని.. తన దగ్గరున్న ఆధారాలను వారికిస్తానని చెప్పాడు. శ్రావణి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న సాయి.. దేవ్ రాజ్ ను ప్లే బాయ్ గా అభివర్ణించేశాడు.

దేవరాజ్ ఖాతాలో ఇంకా చాలామంది అమ్మాయిలు, ఆంటీలు ఉన్నారని అన్నాడు. వాడిపని అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేయడమే అని చెప్పిన సాయి కృష్ణ.. దేవరాజ్ తనపై తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నాడని అన్నాడు. దేవరాజ్ వేరే అమ్మాయిలతో ఉన్న వీడియోలు, మాట్లాడిన ఆడియోలు శ్రావణినే స్వయంగా తమకు ఇచ్చిందని సాయి కృష్ణ తెలిపాడు. ఈ కేసు నుంచి బయట పడేందుకు నిర్మాత అశోక్ రెడ్డిని కూడా అతనే ఇరికించాడని చెప్పాడు.

కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ను ఇప్పటికే పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించిన విషయం తెలిసిందే. తొలుత దేవరాజ్ను నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దేవరాజ్ అందించిన ఆధారాలతో ఇప్పుడు.. కేసు మొత్తం సాయి మెడకు చుట్టుకుంటోంది. సాయి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. చూడాలి మరి పోలీసుల ఎదుట సాయి కృష్ణ ఎలాంటి ఆధారాలు చూపిస్తాడనేది.