నాలుగు రోజుల్లోనే ‘రెడ్’ బ్రేక్ ఈవెన్ అయింది – ‘స్రవంతి’ రవికిశోర్‌

289
Sravanthi Ravi kishore Talk about Ram RED Movie collections

హ్యూమన్‌ ఎమోషన్స్‌, వేల్యూస్‌ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు అందించే నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్‌ ముందు వరుసలో ఉంటారు. రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘రెడ్‌’. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చింది. నాలుగు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయింది. ఈ నెల 22 మలయాళంలో, ఆ తర్వాత వివిధ భాషల్లో విడుదల కానుంది.

థ్యాంక్యూ. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని, వసూళ్ల వస్తాయని ముందునుంచీ నమ్మకం ఉంది. వాళ్లకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ఇన్నాళ్లు ఎదురు చూశాం. థియేటర్లలో సినిమా చూసి బావుందని ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది.తొలి రోజు సినిమాకు రూ. 6.7 కోట్ల షేర్‌ వచ్చింది. రెండో రోజు రూ. 4.17 కోట్లు, మూడో రోజు రూ. 2.71 కోట్లు, నాలుగో రోజు రూ. 2.26 కోట్ల షేర్‌ వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటంటే… మేజర్‌ ఏరియాలు కొన్నిటిలో మేం విడుదల చేసినప్పటికీ, మిగతా ఏరియాల్లో చాలా రీజనబుల్‌ రేటుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాం. కరోనాకి తోడు 50 శాతం ఆక్యుపెన్సీని దృష్టిలో పెట్టుకుని… మామూలు రేటు కంటే తక్కువ రేటుకు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఆ డబ్బులు కూడా వచ్చేశాయి. తక్కువ రేటుకు ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది ఏమీ జరగలేదు.

మనకు వస్తాయనుకున్న డబ్బుల్లో కొంత తగ్గింది తప్పితే… నష్టపోయింది ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి ఎదుర్కొనాలనేది నా అభిమతం. కరోనా సమయంలోనూ… ఓ రేటుకు సినిమాను అమ్మడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్‌ చేయాలనేది వచ్చిందో, అప్పుడు మళ్లీ రేటు తగ్గించి… ఈ విధంగా చేస్తే మీకూ, మాకూ కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందని అనడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకొచ్చారు. సరిపడా థియేటర్లలో విడుదల చేశారు. వాళ్లు పెట్టిన పెట్టుబడి కొన్నిచోట్ల రెండో రోజు, కొన్ని చోట్ల మూడో రోజే తిరిగి వచ్చేసింది. పశ్చిమ గోదావరిలో రెండో రోజుకే బ్రేక్‌ ఈవెన్‌ అయింది. తూర్పు గోదావరిలో మూడో రోజు బ్రేక్‌ ఈవెన్‌ అయింది. నాలుగు రోజుల్లో అందరికీ లాభాలు వచ్చాయి. ‘స్రవంతి’ రవికిశోర్‌ చెపుకు వచ్చారు..