Director Anil Ravipudi and Sreeleela relationship, Sree Leela personal relationship with the director Anil Ravipudi, Sreeleela upcoming movies, Sreeleela Movies, Sreeleela Marriage rumors.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరు అంటే శ్రీలీల అనే పేరు మాత్రమే వినపడుతుంది. తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేస్తుంది.. అలాగే వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కూడా తనదైన మార్పు వేసుకుంటుంది. సినిమాలపరంగా వైరల్ అవుతున్న శ్రీలీల పేరు ఇప్పుడు తన పర్సనల్ విషయాల్లో కూడా మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు డజన్ సినిమాల్లో నటిస్తుంది. కొన్ని సినిమాలు షూటింగు దశలో ఉండగా.. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. అలాగే మరికొన్ని సినిమాలు అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి అయితే అందరూ శ్రీలీల కీలకమైన పాత్రలో చేసిన బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా పైనే ఉంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతానికి టీజర్ అలాగే ట్రైలర్ విడుదల చేయటంతో సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్ కి. అలాగే శ్రీలీల కూడా కీలకమైన పాత్రలో చేయడం వల్ల తను కూడా ఈ సినిమాపై అసలు బాగానే పెట్టుకున్నారు. అలాగే దర్శకుడు అనిల్ తన క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసినట్టు.. విడుదలైన తర్వాత తనకి ఈ సినిమాతో మంచి పేరు తెచ్చి పెడుతుందని ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది.
అయితే ఇక్కడ దర్శకుడు అనిల్ రావిపూడి అలాగే శ్రీలీల మధ్య పుకార్లు బయటికి వస్తున్నాయి. సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో దర్శకుడు అనిల్ ని శ్రీలీల మామ అంటూ పిల్చేదని.. అలాగే అందరి ముందల సార్ అంటూ పిలిచేదని ఒక వార్త అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అసలు విషయానికి వెళ్తే శ్రీలీల తల్లి అలాగే అనిల్ రావిపూడి ఊరు ఒకటే అంటా.
శ్రీలీల పుట్టి పెరిగిందంతా బెంగళూరు అయినప్పటికీ.. తనకి టైం దొరికినప్పుడల్లా తన అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి పది రోజులు గడిపేదని. అలాగా అనిల్ రావిపూడి కి సాన్నిహిత్యం ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. పైగా శ్రీలీల తల్లి మరియు అనిల్ రావిపూడి కజిన్స్ అవుతారట. అందుకనే దర్శకుడు అనిల్ ని శ్రీలీల మామ అని పిలిచేదని అంతకుమించి ఎటువంటి రిలేషన్ లేదు అంటూ అంటూ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. మరి దీనిపైన ఇద్దరు స్పందిస్తారో లేదో చూడాలి..