శ్రీవిష్ణు హీరోగా అర్జున ఫ‌ల్గుణ టైటిల్ పోస్టర్ విడుదల

0
181
Sree Vishnu Next ARJUNA PHALGUNA Cast Crew, Poster, Release Date, Teaser, Trailer

శ్రీవిష్ణు హీరోగా, ‘జోహార్’ ఫేమ్ తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో ఆ సంస్థ నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9కు ఆదివారం ‘అర్జున ఫ‌ల్గుణ’ అనే టైటిల్ ప్ర‌క‌టించారు. మ‌హాభార‌తంలో అర్జునునికి ఫ‌ల్గుణ అనే మ‌రో పేరు కూడా ఉంద‌ని మ‌న‌కు తెలుసు. ఫాల్గుణ మాసంలో జ‌న్మించినందున ఆయ‌నను ఆ పేరుతోనూ పిలుస్తుంటారు.

టైటిల్ పోస్ట‌ర్‌లో ఐదుగురు వ్య‌క్తులు ప‌రుగులు పెడుతుంటే, వారిని ఓ పోలీస్ జీప్ వెంటాడుతోంది. పైన వ్య‌క్తుల ముఖాలు మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. కానీ వారు ప‌రుగెత్తుతుండ‌గా, ప‌క్క‌నే ఉన్న కాల‌వ‌లో వారి ప్ర‌తిబింబాలు క‌నిపిస్తున్నాయి. ఆ ప్ర‌తిబింబాలు ఎవ‌రివో వెల్ల‌డ‌వుతున్నాయి. హీరో హీరోయిన్లు, వారి ముగ్గురు ఫ్రెండ్స్.. పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి పారిపోతున్నార‌ని ఆ పోస్ట‌ర్ తెలియ‌జేస్తోంది. టైటిల్ డిజైన్‌ను రెగ్యుల‌ర్‌గా కాకుండా సంస్కృత లిపి త‌ర‌హాలో డిజైన్ చేయ‌డం గ‌మ‌నార్హం.

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న మ‌రో ఉత్తేజ‌భ‌రిత చిత్రం ‘అర్జున ఫ‌ల్గుణ‌’. ఎప్పుడూ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటూ ఉంటార‌ని పేరుపొందిన శ్రీ‌విష్ణు మ‌రో ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ‘అర్జున ఫ‌ల్గుణ‌’కు సంబంధించి 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

శ్రీ‌విష్ణు స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టిస్తోన్న‌న ఈ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్‌.ఎం. పాషా స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ మూవీకి క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను ద‌ర్శ‌కుడు తేజ మ‌ర్ని స్వ‌యంగా స‌మ‌కూరుస్తున్నారు. సుధీర్ వ‌ర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు.

Sree Vishnu Next ARJUNA PHALGUNA Titled Poster Released

తారాగ‌ణం: శ్రీ‌విష్ణు, అమృతా అయ్య‌ర్‌, సీనియ‌ర్ న‌రేష్‌, శివాజీ రాజా, సుబ్బ‌రాజు, దేవీప్ర‌సాద్‌, ‘రంగ‌స్థ‌లం’ మ‌హేష్‌, రాజ్‌కుమార్ చౌద‌రి (‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌), చైత‌న్య (‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్‌).

Previous articleSree Vishnu Next “ARJUNA PHALGUNA” Titled Poster Released
Next article`క‌ప‌ట‌ధారి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగార్జున‌