Arjuna Phalguna Review In Telugu – శ్రీ విష్ణు అర్జున ఫాల్గుణ రివ్యూ |
|
నటీనటులు: | శ్రీ విష్ణు, అమృత అయ్యర్ |
రేటింగ్ : | 2/5 |
దర్శకత్వం: | తేజ మార్ని |
నిర్మాత: | కళ్యాణ్ కృష్ణ |
సంగీతం: | ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్ |
అర్జున ఫాల్గుణ మూవీ రివ్యూ: శ్రీ విష్ణు మరియు అమృత అయ్యర్ జంటగా నటించిన అర్జున ఫాల్గుణ విడుదల అయింది. శ్రీ విష్ణు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే చిత్రమిది. శ్రీవిష్ణు మరియు అతని స్నేహితులు సోడా తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాలనుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు, అతని స్నేహితులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు (గంజాయి స్మగ్లింగ్) పాల్పడుతారు. అప్పుడు అసలు కథ స్లాట్ ప్రారంభమవుతుంది. అర్జునుడు, అతని నిరుద్యోగ స్నేహితులు పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నారు … వారు ఎలా విజయం సాధించారు అనేది కథ.
ప్లస్ పాయింట్స్:
శ్రీ విష్ణు నటన
గోదారి వల్లే సందమామ సాంగ్
మైనస్ పాయింట్స్:
దర్శకత్వం
ప్రోడక్షన్ వాల్యూస్
వీక్ స్టోరీ
అనవసరమైన సన్నివేశాలు
నటీనటుల పర్ఫార్మెన్స్:
సాధారణంగా అర్బన్ బేస్డ్ పాత్రల్లో నటించే శ్రీవిష్ణు ఈ సారి మాస్ క్యారెక్టరైజేషన్‌తో కూడిన పల్లెటూరి పాత్రలో కనిపిస్తారు. శ్రీ విష్ణు ఎప్పుడైనా తన క్యారెక్టర్ కి న్యాయం చేయాలని చాలా కష్టపడతాడు. అలాగే ఈ సినిమాలో కూడా తన నటన చాలా బాగుంది అని చెప్పాలి. రంగస్థలం మహేష్ క్యాజువల్ సీన్స్‌లో బాగా నటించాడు.
ఇక హీరో తండ్రిగా శివాజీరాజా, గ్రామ కరణంగా వి.కె.నరేష్ సరైన ఎంపిక. ఇంక హీరోయిన్ అమృత అయ్యర్ అంతగా అలరించలేకపోయింది. నరేష్, శివాజీరాజా చిన్న చిన్న పాత్రల్లో బాగానే నటించారు.
టెక్నీషియన్స్ పనితీరు:
ఇక ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చక్కగా ఉన్నాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈసారి ప్రొడక్షన్లో విఫలమైంది. ప్రియదర్శన్ బాలసుబ్రమనియన్ సమకూర్చిన సంగీతం సినిమాకు కొంత ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యావరేజ్‌గా నిలిచింది. దర్శకుడు తేజ మార్ని ఈ ప్రాజెక్ట్‌తో ముందుకు సాగడానికి ముందు అర్జున ఫాల్గుణ కథ మరియు స్క్రిప్ట్‌పై బాగా ఫోకస్ చేసినట్టే అయితే సినిమా బాగుండేది.
తీర్పు:
మొత్తం మీద అర్జున ఫాల్గుణ యావరేజ్ ఎమోషనల్ డ్రామా. సినిమాలో నటీనటుల నటన మాత్రమే ప్లస్ పాయింట్. ప్రియదర్శన్ బాలసుబ్రమనియన్ సమకూర్చిన సంగీతం సినిమాకు కొంత ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. బలహీనమైన డైరెక్షన్, స్క్రీన్‌ప్లే, కొన్ని లాజికల్ సీన్లు ఎక్కువ మంది వీక్షకులకు నచ్చకపోవచ్చు. “అర్జుణ ఫాల్గుణ” చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచినట్టే అని చెప్పాలి.