తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!

0
119
Sree Vishnu Thippara Meesam Review, Thippara Meesam Movie Review, Ratings
Sree Vishnu Thippara Meesam Review, Thippara Meesam Movie Review, Ratings

Release Date : 08 నవంబర్ 2019
Rating: 2.75/5
Starring : శ్రీవిష్ణు, నిక్కి తంబోలీ, రోహిణి
Director : కృష్ణ విజయ్
Music Director : సురేష్ బొబ్బిలి
Cinematography : సిడ్
Producer : రిజ్వాన్
Banner : రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్స్

“బ్రోచేవారెవరురా” లాంటి సూపర్ హిట్ తర్వాత శ్రీవిష్ణు నటించగా విడుదలైన చిత్రం “తిప్పరా మీసం”. అంతే కాకుండా మంచి మంచి సబ్జక్ట్స్ కూడా ఎన్నుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అలా ఇప్పుడు తాను హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో వైవిధ్య చిత్రం “తిప్పరా మీసం”.పోస్టర్స్ మరియు వీడియోస్ తో మంచి ఆసక్తిని ఏర్పర్చిన ఈ చిత్రం ఈరోజే విడుదల అయ్యింది. మరి సినిమా కూడా అదే స్థాయిలో అలరించిందో లేదో చూద్దాం..!!

కథ:

స్కూల్ వయసు నుంచే డ్రగ్స్ కి అలవాటుపడి.. తల్లి (రోహిణి) బలవంతంగా రిహేబ్ సెంటర్ లో చేర్పించగా అక్కడ పరిణితి చెండాల్సిందిపోయి.. శ్రీవిష్ణు ఒక పబ్ లో డీజే గా పని చేస్తుంటాడు.అదే విధంగా మణి (శ్రీవిష్ణు). డ్రగ్స్, తాగుడు, అమ్మాయిలు, క్రికెట్ బెట్టింగులు, గొడవలు ఇలా మణికి లేని చెడు బుద్ది అంటూ ఉండదు. అలా బెట్టింగ్స్ కు అలవాటు పడ్డ శ్రీ జీవితం ఒక్కసారిగా ఉహించని మలుపు తిరుగుతుంది. ఒక సందర్భంలో క్రికెట్ బెట్టింగ్ లో 30 లక్షలు అప్పుకు గురవుతాడు. ఆ అప్పు తీర్చే ప్రయత్నంలో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఈ పరిస్థితుల నుండి మణి ఎలా బయటపడ్డాడు అనేది “తిప్పరా మీసం” కథ.

విశ్లేషణ :

ఈ చిత్రానికి మొట్టమొదటి బలం హీరో శ్రీ విష్ణుయే అని చెప్పాలి.ఇది వరకే మనం శ్రీవిష్ణు చేసిన ఎన్నో పాత్రలను చూసాం.తనకిచ్చిన ఏ పాత్ర అయినా సరే చాలా ఈజ్ గా సునాయాసంగా చేసేస్తాడు.అలా ఒక సరికొత్త శ్రీవిష్ణు ఈ చిత్రం ద్వారా కనిపిస్తాడు. “బ్రోచేవారెవరురా” లాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ తర్వాత శ్రీవిష్ణుని కంప్లీట్ సీరియస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులకు ప్రెజంట్ చేయాలనుకోవడం మంచిదే. అలాగే హీరోయిన్ నిక్కీ తంబోలి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది.అంతే కాకుండా శ్రీవిష్ణు మరియు అతని తల్లికి సంబంధించిన ప్రతీ ఎమోషనల్ ఎపిసోడ్ కూడా బాగుంటుంది.ముఖ్యంగా సినిమాలో లాస్ట్ 10 నిమిషాలు సినిమా మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

డైరెక్టర్ గా కథ రాయాలి అని ఫిక్స్, అయినప్పుడు పేపర్ మీద రాసుకున్న మదర్ అండ్ సన్ ఎమోషన్ బాగుంది కానీ దాన్ని పూర్తి కథగా రాసే క్రమంలో ఎమోషన్ లో అంత ఇంపాక్ట్ కనిపించలేదు. అలాగే స్క్రీన్ మీద చాలా డల్ ఫీలింగ్ వచ్చేలా తీసాడు. దర్శకుడు కృష్ణ విజయ్ విషయానికి వచ్చినట్టయితే తాను అనుకున్న పాయింట్ ను తెరకెక్కించే క్రమంలో దానిని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయాన్నే తీసుకున్నారని చెప్పాలి. అలాగే శ్రీ తల్లిగా చేసిన రోహిణి మరోసారి అద్భుత నటన పండించారు.

కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. కథాకథనాలు స్లోగా సాగుతూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు. అయితే సినిమాలో శ్రీవిష్ణు యాక్టింగ్ అండ్ తల్లి సెంటిమెంట్ ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి సినిమాకు మరింత ప్లస్ అయ్యారు.కేవలం పాటలు మాత్రమే కాకుండా మంచి నేపధ్య సంగీతం కూడా అందించారు. అలాగే ఎంతో కీలకమైన స్క్రీన్ ప్లే కూడా అంతగా మెప్పించదు. ఈ విషయాల్లో కృష్ణ విజయ్ పలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

శ్రీవిష్ణు

సినిమాటోగ్రఫీ మరియు సంగీతం

చివరి పది నిమిషాలు

మైనస్ పాయింట్స్ :

కథ

దర్శకత్వం

తీర్పు :

శ్రీవిష్ణు – నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. కోపం అనేది వెండితెరపై ప్రెజంట్ చేయదగ్గ అద్భుతమైన ఎమోషన్. కథాకథనాలు స్లోగా సాగుతూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు. ఆ ఎమోషన్ కు మంచి కథ-కథనం జోడించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దాంతో “తిప్పరా మీసం” ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here