శర్వానంద్ ‘శ్రీకారం’ ట్రైలర్

413
Sreekaram​ Trailer | Sharwanand, Priyanka Arul Mohan | Kishor B | Mickey J Mayer
Sreekaram​ Trailer | Sharwanand, Priyanka Arul Mohan | Kishor B | Mickey J Mayer

టాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వానంద్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా అతడు చేసిన శ్రీకారం సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను అధికం చేస్తున్నాయి.

 

 

అయితే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను ముగ్గురు హీరోలతో లాంచ్ చేయించారు  . మెగా హీరో వరుణ్ తేజ్, నాచురల్ స్టార్ నాని, నితిన్ చేతులు మీదుగా ఈ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిముషాలుకు విడుదల అయ్యింది . ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోషన్ హీరోయిన్‌గా నటించారు.

 

 

 

అంతేకాకుండా రావు రమేష్, నరేష్, మురళీ శర్మ, సాయి కుమార్, ఆమని, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను నూతన దర్శకుడు కిశోర్ రెడ్డి డైరెక్షన్‌లో గోపి అచంట, రామ్ అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ రైతుగా కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి11న విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి శర్వా శ్రీకారంతో అభిమానుల అంచనాలను ఏమాత్రం అందుకుంటారో వేచి చూడాలి.