‘శ్రీకారం’ భలేగుంది బాల వీడియో సాంగ్

458
Sreekaram - Bhalegundi Baalaa Video Song | Sharwanand | Kishor B | Mickey J. Meyer
Sreekaram - Bhalegundi Baalaa Video Song | Sharwanand | Kishor B | Mickey J. Meyer

శర్వానంద్, ప్రియాంక అరుళ్‌మోహన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్‌ .బి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అంటూ సాగే పాట వీడియో సాంగ్ ను విడుదల చేసింది.

 

‘వ‌చ్చానంటివో పోతానంటివో వ‌గ‌లు ప‌లుకుతావే..క‌ట్ట‌మింద బోయే అల‌క‌ల చిల‌క భ‌లేగుంది బాలా..దాని ఎధాన ఉండే పూల పూల రైకా భలేగుంది బాలా’ అంటూ పెంచ‌ల్ దాస్ స్వ‌యంగా రాసి.. పాడిన ఈ పాట ప‌ల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగుతూ ఈ పాట అందరిని అల‌రిస్తోంది. శర్వానంద్ మాస్ డాన్సులు వేస్తుంటే.. లంగావోణిలో ప్రియాంక వయ్యారంగా నడుస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ‌ర్వానంద్ రైతుగా క‌నిపించనున్నాడు.

 

ఈ సినిమా మార్చి11న విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి శర్వా శ్రీకారంతో అభిమానుల అంచనాలను ఏమాత్రం అందుకుంటారో వేచి చూడాలి.