Sreeleela In Allu Arjun – Trivikram Next Movie: శ్రీ లీల ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్, ఎందుకంటే ప్రేక్షకులు ఆమెను అందరూ ఆదరిస్తున్నారు. తన అందం అలాగే నటనతో కుర్రకారుని కట్టిపడేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవల, ఆమె వెంకీ కుడుముల మరియు నితిన్ సినిమాలో కూడా తీసుకున్నట్టు సమాచారమైతే తెలుస్తుంది.
Sreeleela In Allu Arjun – Trivikram Next Movie: ప్రస్తుతం ఉన్న సినిమాలే కాకుండా లేటెస్ట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా శ్రీలేలాన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు శ్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గురు పూర్ణిమ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. శ్రీలీల చేరికతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
జులాయి, S/O సత్యమూర్తి, భారీ బ్లాక్‌బస్టర్ అలా వైకుంఠ పుర్రములో తరువాత నాలుగోసారి ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి ఫాన్స్ లో. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా చేస్తున్న శ్రీ లీల తన తదుపరి సినిమాలో కూడా కనబడబోతుంది. త్రివిక్రమ్ ఎప్పుడూ తన సినిమాల్లో నటీమణులను 2–3 సినిమాలకు కొనసాగిస్తూనే ఉంటాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విదేశాల నుండి తిరిగి వచ్చిన అల్లు అర్జున్ ఆగస్టు 6 నుండి పుష్ప 2 కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. గీతా ఆర్ట్స్ మరియు హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్ మరియు ఎస్ రాధా కృష్ణ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.