Homeసినిమా వార్తలుVD12 Heroine: విజయ్ దేవరకొండ సినిమా నుండి తప్పుకున్న శ్రీలీల..!

VD12 Heroine: విజయ్ దేవరకొండ సినిమా నుండి తప్పుకున్న శ్రీలీల..!

Sreeleela replaced with Sakshi Vaidya for VD12 heroine, Vijay Devarakonda and Gautam Tinnanuri movie VD12 heroine, VD12 Cast Crew, VD12 Shooting update, VD new movie

Sreeleela Replaced with Sakshi Vaidya for VD12 heroine, Vijay Devarakonda and Gautam Tinnanuri movie VD12 heroine, VD12 Cast Crew, VD12 Shooting update, VD new movie

విజయ్ దేవరకొండ VD12 సినిమా నుంచి శ్రీలీల తప్పుకుంది. ఈ వార్తలతో అభిమానులు ఖచ్చితంగా సంతోషంగా ఉండరు, అయితే తాజా నివేదికలు శ్రీలీల ఈ పెద్ద ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా కోసం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అర్జున్ రెడ్డి స్టార్‌తో ధమాకా హీరోయిన్ జతకట్టింది.

కొన్ని రోజుల క్రితం MAD సినిమా ప్రమోషన్స్ లో VD12 budget 100 కోట్లకు పైగా ఉంటుందని నిర్మాత నాగ వంశీ అధికారికంగా చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, శ్రీలీల ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు వచ్చిన పుకార్ల నమ్మొద్దు అంటూ వాటిని ఖండించారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ VD12 సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు సమాచారం గట్టిగానే వినపడుతుంది.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటి శ్రీలీల (Sreeleela). అరడజనుకు పైగా తెలుగు సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ప్రస్తుతం దూసుకుపోతుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రానికి శ్రీలీల సంతకం చేయటం అలాగే సినిమా ఓపెనింగ్ కూడా తను రావడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ స్టార్‌పై దృష్టి పెట్టడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

అయితే ఇదే టైంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నా హీరోయిన్ శ్రీలీల తన డేట్స్ ఈ సినిమాకి కేటాయించి లేకపోవడంతో మేకర్స్ వేరే హీరోయిన్ ని వెతకడం మొదలుపెట్టడం జరిగింది. లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు ఏజెంట్, గందీవధారి అర్జునలో కనిపించిన సాక్షి వైద్యను (Sakshi Vaidya) సంప్రదించారని, చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాని పూర్తి చేసిన తర్వాత, సినిమా షూటింగ్ వచ్చే ఏడాది తిరిగి ప్రారంభమవుతుంది. గౌతమ్ తిన్ననూరి మొదటిసారి యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయటానికి అంతా ప్లాన్ సిద్ధంగా చేసుకున్నట్టు అలాగే విజయ్ దేవరకొండ పోలీసు గ్యాంగ్ స్టార్ గా ఈ సినిమాలో కనబడబోతున్నట్టు తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ వెంచర్‌కు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY