sreemukhi Met Pawan Kalyan At Vakeel Saab shooting Sets

Sreemukhi Pawan Kalyan:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన కోర్టు సెట్‌లో పవన్ కళ్యాణ్‌పై నన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గుబురు గెడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ షూటింగ్ కోసం గెడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్మార్ట్ లుక్ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ‘వకీల్ సాబ్’తో శ్రీముఖి దిగిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న స్టూడియోలోనే ‘బొమ్మ అదిరింది’ షో చిత్రీకరణ కూడా జరుగుతున్నట్టుంది. దీంతో ఆ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తోన్న శ్రీముఖి, న్యాయనిర్ణేతగా ఉన్న జానీ మాస్టర్, కమెడియన్ పొట్టి రియాజ్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆయనతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..